top of page
Shiva YT

📰📱 వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌..

📱💬 ఒక ఫోన్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించుకునే అవకాశం ప్రస్తుతం లేదనే విషయం తెలిసిందే. ఒక ఫోన్‌లో కేవలం ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

🔒📊 అయితే క్లోన్‌డ్‌ వాట్సాప్‌ వంటి వాట్సాప్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్నా భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరూ వీటిని ఉపయోగించలేరు. అందుకే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

📲📌 వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఒకే వాట్సాప్‌తో వేర్వేరు అకౌంట్‌లను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొందరికే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇకపై ఒకే యాప్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

🔑🔄 ఇక ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా వాట్సాప్‌ అకౌంట్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ వద్ద ఉన్న బాణం సింబల్‌తో మరో అకౌంట్‌ని యాడ్‌ చేసుకోవచ్చు.

📲🔒 దీని సహాయంతోనే వేరే ఖాతాకు మారొచ్చు. ఇలా ఒక అకౌంట్‌లో పర్సనల్‌ చాట్స్‌, మరో అకౌంట్‌లో ప్రొఫెషనల్‌కు సంబంధించిన చాటింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. 🎉💼📱

bottom of page