top of page
Shiva YT

✈️ స్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికుల పడిగాపులు.. 🚀

🛫 విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కాల్‌ చేశాడు. దాంతో ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ నుంచి పూణె వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్టు కాల్ సెంటర్‌కు శుక్రవారం ఉదయం ఫోన్‌ కాల్‌ వచ్చింది.

దీంతో ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికులను ఢిల్లీ విమానాశ్రయంలో దించేశారు. మొత్తం 100 మందికి పైగా ఫిల్‌ చేసిన ప్రయాణికులందరినీ తిరిగి తీసుకువచ్చిన తర్వాత విమానాశ్రయంలో వేచి ఉండాల్సిందిగా కోరామని, విమానాన్ని రిమోట్ బేకు తీసుకువెళుతున్నామని చెప్పారు.

🌍 గురుగ్రామ్‌లోని GMR కాల్ సెంటర్‌లో UK-971 ఢిల్లీ నుండి పూణే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది అని భద్రతా ఏజెన్సీ అధికారి మీడియాకు తెలిపారు. విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకుల లగేజీలన్నీ డి-బోర్డింగ్ చేయబడ్డాయి. ప్రయాణికులు ప్రస్తుతం టెర్మినల్ భవనంలో ఉన్నారని, వారికి అన్ని సదుపాయాలు సమర్చినట్టుగా అధికారి తెలిపారు.

✈️ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం, సెక్యూరిటీ ఏజెన్సీలు క్లియరెన్స్ ఇచ్చి, ఫ్లైట్‌ని కొనసాగించే వరకు విమానం షెడ్యూల్ చేయబడదు. సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి తుది క్లియరెన్స్ రాగానే విమానం గమ్యస్థానం (పుణె)కి బయలుదేరుతుంది. 🛬

bottom of page