top of page

📱🔍 హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్‌లు..

📅 హువావే కంపెనీ బార్సిలోనాలో ఈ నెల 14న నిర్వహించే ఈవెంట్లో హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లను ఆవిష్కరించనుంది. 🚀

కంపెనీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపింది. అసలు విషయాన్ని వెల్లడించకుండా నర్మగర్భంగా వెల్లడించింది. 🌟 హువావే ట్విట్టర్ ఖాతాలో ‘వేరబుల్ స్ట్రెటజీ అండ్ న్యూ ప్రాడక్ట్ లాంచ్ ’ అని కోట్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది. 📢 పైగా వాచ్ డైల్ ను ఈ కోటేషన్ కు జోడించి పోస్టర్ ను విడుదల చేసింది. 💥 దీంతో మెగా ఈవెంట్లో లాంచ్ అయ్యేది స్మార్ట్ వాచేనని హింట్ ఇచ్చింది. 🤫 దీనిపై టిప్ స్టర్ సైట్ స్పందిస్తూ హువావే వాచ్ జీటీ 4 సిరీస్ నే వచ్చే ఈవెంట్లో గ్రాండ్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. 🚀 యాపిల్ వండర్ లస్ట్ ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత హువావే ఈ పోస్ట్ పెట్టింది. 📅 ఈ పోస్ట్ లో కనిపిస్తున్న పోస్టర్ ఆధారంగా ఇది కచ్చితంగా జీటీ 4 సిరీస్ వాచ్ లే అన్న అంచనాకు మార్కెట్ వర్గాలు వచ్చాయి. 📊 కాగా ఈ హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లకు సంబంధించిన ఎటువంటి వివరాలు సంస్థ వెల్లడించలేదు. 🤷‍♂️ దీని గురించి పూర్తి వివరాలు లాంచ్ రోజునే వెల్లడయ్యే అవకాశం ఉంది. 📅

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page