top of page

🎮 గేమింగ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస​… సోనీ ప్లే స్టేషన్‌పై అద్భుత ఆఫర్‌..

🔥 సోనీ తాజా ఆఫర్‌ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్, క్రోమా వంటి వాటిల్లో ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. 🌟

అలాగే ఎంపిక చేసిన రిటైలర్ల వద్ద కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చని సోనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 📢 అయితే సోనీ ప్లే స్టేషన్‌ డిజిటల్ ఎడిషన్ ధర రూ. 39,990గా ఉంటుంది. ఈ ఎడిషన్‌పై ఎలాంటి తగ్గింపు ఉండదు.

🎮 మరోవైపు డిజిటల్ ఎడిషన్‌లో డిస్క్ డ్రైవ్ లేదు. డిజిటల్ గేమ్‌లను మాత్రమే ప్లే చేయగలదు. 🕹️ గత సంవత్సరం నవంబర్‌లో, రెండు ఎడిషన్‌ల ధరలు పెంచారు. అందువల్ల భారతదేశంలో పీఎస్‌ 5 డిస్క్ ఎడిషన్‌ను పొందేందుకు ఈ పరిమిత కాల ఆఫర్ మంచి అవకాశం అని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 👾 ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్‌తో పాటు డిజిటల్ ఎడిషన్ రెండూ డ్యూయల్ సెన్స్ వైర్‌లెస్ కంట్రోలర్‌లు, అడాప్టివ్ ట్రిగ్గర్‌లతో వస్తాయి. ఈ పరికరాలు 16జీబీ జీడీడీఆర​6 ర్యామ్‌+ 825 జీబీ నిల్వతో పాటు ఏఎండీ ఆర్‌డీఎన్‌2 గ్రాఫిక్‌లను అందిస్తాయి. అవి ఆక్టా-కోర్ ఏఎండీ రైజెన్ జెన్ 2 ప్రాసెసర్‌తో అమర్చి ఉంటాయి. 🎉

コメント


bottom of page