top of page

పొత్తులపై కాంగ్రెస్ సైలెంట్.. 🤫🔍

పొత్తుల విషయంలో టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుండి కూటమిని ఏర్పాటు చేసింది.

కానీ, ఆ తర్వాత వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. దీంతో మరోసారి అలా జరగకుండా పొత్తు విషయంలో సైలెన్స్ మెయిటైన్ చేస్తోంది హస్తం పార్టీ. ఒక మెట్టు దిగొస్తే సీపీఐ, సీపీఎంలతో పాటు టీజేఏస్, బీఏస్పీ పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ పార్టీలకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడితే ఆపార్టీ గెలిచే మెజారిటీ స్థానాలు పొత్తులో భాగంగా మిత్ర పక్షాలకు ఇవ్వాలి.. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ నేతలు పొత్తు విషయంలో విముఖతతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, లెఫ్ట్ పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా.. వారే ఒక మెట్టుదిగి కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆమోదిస్తే తప్ప కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడేలా లేదు. దీంతో పొత్తు విషయంలో ఏటూ తేలని పరిస్థితి ఏర్పడింది. ఏదిఏమైనా పొత్తు చిత్తుతో కావాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హస్తం పార్టీపై ఉందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.. 😐🤔

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page