గ్లోబల్ న్యూస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడుతూ.. ‘భారత్‌తో సంబంధాలు సవాలుగా మారాయని మేము అర్థం చేసుకున్నాం. అయితే అదే సమయంలో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని బయటకు తీసుకురావడం మా బాధ్యత.
ఆరోపణలు నిజమైతే, కెనడాకు ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుంది’ అని ఆయన అన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను తమకు ఎంతో ముఖ్యమైనవిగా ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో చట్టాన్ని రక్షించడం మా బాధ్యత. విచారణ చేసి అసలు నిజాన్ని బయటకు తీసుకువస్తామంటూ ఆయన అన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడా మధ్య సంబంధాలు గత వారం రోజుల నుంచి దారుణంగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. అయితే కెనడా ఆరోపణలు నిరాధారమైనవనిగా భారత్ కొట్టిపారేసింది. మిలిటెంట్లు, భారత వ్యతిరేక సంస్థలపై ఆపరేషన్లు నిర్వహించాలని కెనడాను భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది. కెనడియన్ల కోసం ప్రస్తుతానికి వీసా సేవలు నిలిపివేస్తున్నట్లు తెల్పింది. అలాగే దేశంలోని తన దౌత్య సిబ్బందిని తగ్గించాలని కెనడాను భారత్ కోరింది. కాగా.. కెనడాలోఉన్న భారత సిబ్బంది కంటే భారతదేశంలో కెనడియన్ దౌత్య సిబ్బంది సంఖ్య పెద్దది. 🇮🇳🇨🇦