top of page

అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. 📱

వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ 5జీ.. వన్ ప్లస్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో 6.59 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. 64ఎంపీ వెనుకవైపు కెమెరా, ముందు వైపు 16ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 17,999గా ఉంది. 🌐

రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5జీ చిప్ సెట్ తో వస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ, 2ఎంపీ, 5ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ స్మామర్థ్యంతో బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13, రియల్ మీ యూఐ 4.0 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 14,499గా ఉంది. 📸

టెక్నో పోవా 5 ప్రో 5జీ.. గత సెప్టెంబర్లో విడుదలైన ఈ హ్యాండ్ సెట్ మంచి ఫీడ్ బ్యాక్ సంపాదించుకుంది. దీనిలో 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ, 256జీబీ స్టోరేజ్ సాయంతో పనిచేస్తుంది. 50ఎంపీ వెనుకవైపు కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.15,999గా ఉంది. 📷

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page