top of page

రూ. 20 వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు..📱💸

రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫోన్‌ Motorola G84 5G. ఈ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999గా నిర్ణయించారు. 📲💻

మొదట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా వచ్చిన వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి ఇప్పుడు బడ్జెట్ ఫోన్‌లు వస్తున్నాయి. ఇలా విడుదల చేసిందే OnePlus Nord CE3 Lite 5G. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్ అందించారు. 108 ఎంపీ రెయిర్ కెమరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ రూ. 17,999కి అందుబాటులో ఉంది. 🔥💼💽తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో ఫోన్‌ Realme Narzo 60 5G. ఈ ఫోన్‌లో6.43 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. MediaTek Dimensity 6020 చిప్‌సెట్ ఈ ఫోన్‌లోని ప్రాసెసర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 💼💽

రెడ్‌మీ నోట్‌ 13 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 108 ఎంపీ రెయిర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 33 వాట్స్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీని అందించారు. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 📸🚀

తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోన్‌ Samsung Galaxy A15 5G. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌ను అందించారు. MediaTek Dimensity 6100 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 📷🔋


bottom of page