top of page
Shiva YT

🌌 విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు 🌌

🌍విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని మధ్యలో ఒక భారీ కృష్ణబిలం ఉంది. అది చాలా వేగంగా ఎదుగుతోంది. ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలోని పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఈ క్వాసార్‌.. రికార్డు స్థాయిలో మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువ వెలుగు విరజిమ్ముతోంది. దీనికి ఆయువులూదుతున్న కృష్ణబిలం.. భానుడి కన్నా 17 వందల కోట్ల రెట్లు పెద్దగా ఉంది. ఈ కృష్ణబిలం చుట్టూ చేరుతున్న వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుపానును తలపిస్తున్నాయి. ఇది విశ్వంలోనే అత్యంత విస్ఫోటకర ప్రదేశమని పరిశోధనకు నాయకత్వం వహించిన క్రిస్టియన్‌ వుల్ప్‌ తెలిపారు. క్వాసార్‌ను 1980 నాటి ‘స్కై సర్వే’లో యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ గుర్తించింది. అయితే దాన్ని అప్పట్లో ఓ నక్షత్రంగా భావించారు. అది క్వాసార్‌ అని ఆస్ట్రేలియా, చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు తాజాగా తెలిసింది. 🌠



Kommentare


bottom of page