top of page
Shiva YT

మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి..📱🚫

ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఈఎస్‌ఈటీ అనే మాల్వేర్‌ ప్రొటెక్షన్‌ కంపెనీ ఇలాంటి 12 డేంజర్‌ యాప్స్‌లను గుర్తించింది. ఈ యాప్‌ల ద్వారా డేటా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు.

సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ యాప్‌లన్నీ మెసేజింగ్ టూల్స్‌గా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌లన్నీ రహస్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో VajraSpy అనే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) కోడ్‌ని ఉపయోగించాయి. ఈ యాప్స్‌ రహస్యంగా స్మార్ట్ ఫోన్‌లోని ఫైల్‌లు, కాల్ లాగ్‌లు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను దొంగలిస్తున్నాయి. ఈ స్పై యాప్స్‌ను ఇవే.. హలో చాట్, చిట్ చాట్, మీట్ మీ నిడస్, రఫాకత్ న్యూస్, వేవ్ చాట్, ప్రైవ్ టాక్, గ్లో గ్లో, లెట్స్ చాట్, క్విక్ చాట్, యోహో టాక్ వంటి యాప్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ప్రపటికే తొలగించారు. ఒకవేళ ఎవరి ఫోన్‌లో అయినా ఈ యాప్స్‌ ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. హానిట్రాప్‌ వంటి వ్యవహారాలకు ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్లు భద్రతా పరిశోధన సంస్థ భావిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్‌ వచ్చినా, మెసేజ్‌లు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 🕵️‍♂️🔐

bottom of page