ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అమెజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ వాచ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం.
అమేజ్‌ఫిట్ యాక్టివ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో ఏఐ బ్యాక్‌డ్ జెడ్‌ఈపీపీ కోచ్ ను అందించారు. దీంతో కస్టమర్ తనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 12,999కి అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ వాచ్ అమ్మకానికి వచ్చింది.
ఇక ఈ వాచ్‌లో 390X450 పిక్సెల్స్ రిజల్యూషన్తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇక ఈ వాచ్‌ను కేవలం 27 గ్రాముల లైట్ వేట్‌తో రూపొందించడం విశేషం. ఈ వాచ్‌ను లావెండర్ పర్పుల్ కలర్‌లో తీసుకొచ్చారు.
అలాగే ఈ వాచ్‌లో హెల్త్ ఫీచర్స్‌ను సైతం అందించారు. 24X7 హార్ట్‌రేట్, బ్లూడ్ ఆక్సిజన్ శాచురేషన్, స్ట్రెస్ లెవల్ మానిటర్‌తో పాటు 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌కి ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 🌐🔍