top of page

🚀వేములవాడ బీజేపీ టికెట్‌లో బిగ్ ట్విస్ట్..

వేములవాడ అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం యూ టర్న్ తీసుకుంది. 🔀 స్థానిక నాయకత్వం అంతా కూడా మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు తెలపడంతో తుల అభ్యర్థిత్వాన్ని కాదని వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు. 🎫

కొద్ది సేపటి క్రితం బీఫామ్ తీసుకుని వేములవాడ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణం అయ్యాయి. 🚗 భారీ ర్యాలీగా తరలివచ్చిన వికాస్ రావు తన నామినేషన్ దాఖలు చేశారు. 📄

బీజేపీ ఆది నాయకత్వం వాస్తవంగా తెలంగాణాలో వారసులకు టికెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పార్టీ నేతలు ఆ దిశగానే పావులు కదిపారు. ⚖️ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నందున బీజేపీలో వారసులకు అవకాశం ఇవ్వకూడదన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీలోని ఓ వర్గం నాయకులు భావించారు. 🤔 కానీ అనూహ్యంగా వేములవాడ పార్టీ శ్రేణులు పట్టుబట్టి వికాస్ రావుకు టిక్కెట్ ఇప్పించడం లో సక్సెస్ అయ్యారు దీంతో విద్యాసాగర్‌ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం పెద్దలు ఒప్పుకోక తప్పలేదు. 🙌

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page