🌏 ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రమాణస్వీకారాలు జరిగినా.. పొలిటికల్ పార్టీలకు, వ్యక్తులకు సంబంధించిన ప్రచార సామాగ్రి తయారీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. 📢
🏛️ పార్టీల ప్రచార సామాగ్రి తయారీ ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా జరుగుతుంది. 🌆 రానున్న ఎన్నికల కోసం సిటీలో దాదాపు 500 మంది ఉపాధి పొందుతున్నారు. 🏙️ ఎన్నికలు దగ్గర పడే పది రోజుల ముందు, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజుకు 20 గంటలు పాటు లక్ష్యల సంఖ్యలో పార్టీ కండువాలు, జెండాలు తయారీ జరుగుతుంది. ⏰
📢 దాదాపు 20 సంవత్సరాల నుండి వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీలో ఉన్నామని చెబుతున్నారు వ్యాపారులు. 💼 అందుకే ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి సామాగ్రి తయారీ కోసం ముడిసరుకు తెచ్చి పెట్టుకుంటాం. ⏳ ఆర్డర్ ఇచ్చి డబ్బులు చెల్లించడమే ఆలస్యం పని మొదలు పెడతామంటున్నారు వ్యాపారులు. 💪📋