మేళతాళాలతో సందడిగా ఉందా ఇళ్లు. మరికొద్ది క్షణాల్లో తంతు ప్రారంభమవుతుందనగా ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు ప్రియుడితో పరారైంది. సాధారణంగా ఇటువంటి సంఘనలు జరిగితే మగపెళ్లివారు వివాహం రద్దు చేసుకుని,
మేళతాళాలతో సందడిగా ఉందా ఇళ్లు. మరికొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ప్రారంభమవుతుందనగా ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు ప్రియుడితో పరారైంది. సాధారణంగా ఇటువంటి సంఘనలు జరిగితే మగపెళ్లివారు వివాహం రద్దు చేసుకుని తలోదారిన వెళ్లిపోతారు. ఐతే ఈ వరుడు చేసిన పనికి అందరు అవాక్కయ్యారు. వధువు ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెళ్లాడిన వింత ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రాజస్థాన్‌లోని సైనా గ్రామంలో మనీషా, శ్రావణ్ కుమార్ అనే వధువరులకు మే 3న పెద్దలు వివాహం నిశ్చయించారు. మరి కొద్ది నిముషాల్లో పెండ్లి అనగా మనీషా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆరా తీస్తే వధువు ప్రియుడితో వెళ్లిపోయినట్లు తెలిసింది. మనీషా తిరిగి ఇంటికి వస్తే ఆమెను వివాహం చేసుకుంటానంటూ శ్రావణ్ కుమార్ భీష్మించాడు. ఆమె కోసం వారి ఇంట్లోనే 13 రోజులపాటు వేచి ఉన్నాడు. అలంకరించిన పెళ్లి మండపాన్ని కూడా అలాగే ఉంచాడు. మరోవైపు వెళ్లిపోయిన వధువు కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని మే 15న తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత ఆమెను ఒప్పించి శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా మే 16న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. దీంతో వీరి పెళ్లి కథ సుఖాంతమైంది.