🐍 భుజంగ ఆసనం ఎలా వేయాలి.. ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత బోర్లా పడుకోండి. ఇప్పుడు చేతులపై నెమ్మదిగా ఛాతీ భాగాన్ని ఉంచుతూ పైకి లేవాలి. అనంతరం తలను పైకి ఎత్తి చూడాలి. అంటే పడగ విప్పిన పాము ఆకారంలోకి రావాలి. ఇలా ఓ ఐదు నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత నార్మల్ పొజిషన్‌కి రావాలి. మరలా ఇంకో ఐదు నిమిషాలు ఉండాలి. మొదటగా ట్రై చేసేవారు కొద్ది సేపు ఉంటూ ఉండాలి. పైన చిత్రంలో చూసిన విధంగా మీ పోజ్ ఉండాలి.
🌟 భుజంగ ఆసనం ప్రయోజనాలు..
ఈ ఆసనం వేయడం వల్ల భుజం, మెడ భాగాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి వంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి రిలీఫ్ నెస్ పొందుతారు.
రోజూ కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి ఈ ఆసనం బాగా ఉపయోగ పడుతుంది. వెన్ను నొప్పి నుంచి కూడా రిలీఫ్ నెస్ వస్తుంది.
ఈ ఆసనం వేయడం వల్ల ఛాతి, పొట్ట కండరాలు ధృఢంగా మారతాయి. పొత్తి కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. నెల రోజుల పాటు ఈ ఆసనం వేస్తే పొట్ట అనేది చాలా వరకు తగ్గుతుంది.
అయితే శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు, చేతుల్లో బాగా నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. మిగిలివారు ఎవరైనా సరే ఈ ఆసనం వేయవచ్చు. 🌈