top of page
Shiva YT

🏝️ మాల్దీవులకు వెళ్లాలనుకుంటున్నారా..ఈ నెలలో వెళ్తే బెస్ట్..

🏖️ మీ ప్రయాణం మీ బడ్జెట్‌లోనే ఉండేలా చూసుకుంటూ మాల్దీవుల్లో సందర్శించడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. 🏝️

మాల్దీవులలో సుమారు 105 ద్వీప రిసార్ట్‌లున్నాయి. 🏨 మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ రిసార్ట్‌ను ఎంచుకోవచ్చు. 🏖️ మాల్దీవులను సందర్శించబోతున్నట్లయితే మాఫుషి ద్వీపాన్ని సందర్శించవచ్చు. 🚤 ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలుంటాయి. 🏊‍♂️ సాహస క్రీడలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. 🌞 అంతేకాదు ఇక్కడ చౌకైన రిసార్ట్స్ కూడా ఉన్నాయి.

📆 ఏ సీజన్‌లో వెళ్లాలంటే 💰 మీ బడ్జెట్ లో పర్యటన చేయాలనుకుంటే.. 🍁 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మాల్దీవులను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. 🛫 ఈ సమయంలో మీరు రూ. 13 నుండి 15 వేల ధరతోనే విమానా టికెట్ ను పొందుతారు. 🛬 ఢిల్లీ నుంచి మాల్దీవ్ ఎయిర్‌పోర్టుకు విమానంలో ప్రయాణించాలి. 🚢 ఇక్కడ నుండి మాఫుషికి ఫెర్రీని ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 🚤 దీని ఛార్జీ 70 నుండి 100 రూపాయల మధ్య ఉంటుంది.

⏳ ఎన్ని రోజుల ప్రయాణం 🏝️ మాల్దీవులలో గడపడానికి 4 పగలు, 3 రాత్రులు ప్లాన్ చేసుకోవచ్చు. 🌄 అయితే పర్యటనను ఎంజాయ్ చేయాలంటే ప్రయాణం చేసే రోజుల్లో శుక్రవారం రాకుండా చూసుకోండి. 🙌 ఎందుకంటే మాల్దీవుల్లో శుక్రవారం సెలవు.

🌴 ప్రత్యేకత ఏమిటంటే 🏡 మాఫుషి ద్వీపంలో రూ.4 వేల నుంచి రూ.7 వేల ధరల్లో గదులు రెంట్ కు లభిస్తాయి. 🏊‍♂️ ఇక్కడ మీరు అన్ని రకాల సహస క్రీడలను ఎంజాయ్ చేయవచ్చు. 🍽️ అన్ని రకాల రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇక్కడ ఉంటాయి. 💸 ఇక్కడి రెస్టారెంట్‌లో తినడానికి ఒక్కో వ్యక్తికి రూ.500 నుంచి 1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 🍔🍹🍛


bottom of page