🧴🧼 బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ షూలను శుభ్రపరచడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం వల్ల చెడు వాసన, ఫంగస్ పెరుగుదలను నివారిస్తుంది.
కానీ ఈ మిశ్రమంతో తోలు, రెసిన్ లేదా బట్టలతో చేసిన బూట్ల అరికాళ్లను మాత్రమే శుభ్రం చేయడానికి వీలుంటుంది. ఒక గిన్నెలో అర టీస్పూన్ వెనిగర్, పావు కప్పు బేకింగ్ సోడా కలపండి. నురుగు మిశ్రమం ఏర్పడే వరకు మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో షూస్‌పై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. దీని తర్వాత చల్లటి నీటితో కడగాలి.🦶👞👟 టూత్ పేస్టు.. 🪥🦷 టూత్‌పేస్ట్ మీ దంతాలను తెల్లగా మార్చినట్లే.. అది బూట్లు కూడా శుభ్రం చేస్తుంది. 🪥👄 తోలు, రెసిన్ లేదా క్లాత్ షూలను శుభ్రం చేయడానికి పాత టూత్ బ్రష్, పేస్ట్ ని ఉపయోగించాలి. 🪥🦷 ముందుగా షూలను క్లాత్‌తో శుభ్రం చేసి, తడిపి తర్వాత టూత్‌బ్రష్‌తో పేస్ట్‌ను అప్లై చేయాలి. 🪥👄 ఇలా 10 నిముషాలు అలాగే ఉంచి మళ్లీ టూత్ బ్రష్ తో రుద్ది నీళ్లతో కడిగేయాలి. 🪥💧 మీ బూట్లు కొత్తవాటిలా ప్రకాశిస్తాయి. 🪥🦷🌟