🌴 ఉదయపూర్: రాజస్థాన్‌లోని లేక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వివాహాన్ని రాజ శైలిలో ప్లాన్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి ఇండోర్, అవుట్‌డోర్ బాంకెట్ హాల్స్ ఉంటాయి.
అంతేకాదు తక్కువ ధరతో పాటు.. ఖరీదైన రిసార్ట్ కూడా లభిస్తాయి. వివాహ అలంకరణలను ఎంచుకోవాలనుకుంటే రూ.10 లేదా 12 లక్షలకు సరసమైన ప్యాకేజీని పొందవచ్చు. 💒💐
🏝️ కోవలం: కేరళలోని కోవలం నగరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు బెస్ట్ వేదిక. ఇక్కడి బ్యాక్ వాటర్ ఫాల్స్ అందమైన దృశ్యం.. మీ వివాహాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. కోవలంలో బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బెస్ట్ ఎంపిక. దాదాపు రూ.8 నుండి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ వెడ్డింగ్ ప్యాకేజీలు చాలా సరసమైన ధరలో లభిస్తాయి. 🌺🎉
🏖️ గోవా: పార్టీలకే కాదు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కూడా పేరుగాంచింది. అయితే ఇక్కడ శీతాకాలంలో జరిగే వివాహానికి బడ్జెట్ ఎక్కువగా ఉండవచ్చు. అయితే గోవాకు ఆఫ్ సీజన్ వేసవి కాలం. కనుక వేసవిలో పెళ్లి చేసుకునేవారికి వెడ్డింగ్ కు బెస్ట్ వేదిక గోవా. రూ.10 నుంచి 20 లక్షల బడ్జెట్ తో ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. 🏰