నిద్రకు ఉపక్రమించగానే ఆందోళన, భయం వంటివి ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో గుండె కొట్టుకోవడంలో వేగంగా పెరుగుతుంది. ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి, తీవ్ర ఆందోళన వెంటాడుతుంది.
అప్పటి వరకు ఉన్న నిద్ర కాస్త పరార్ అవుతుంది. మనలో చాలా మంది ఇలాంటి సమస్య ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఉన్న సమయంలో ఇలా జరిగితే పర్వాలేదు కానీ, ప్రతీ రోజూ జరిగితే మాత్రం అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. 😟🌙
పడుకునే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే బహుశా ఇది.. స్లీప్ యాంగ్జైటీ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. పడుకునేందుకు బెడ్‌పైకి వెళ్లగానే.. గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఇది స్లీప్ యాంగ్జైటీ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొందరిలో గుండెల్లో నొప్పి, నీరసం, వికారంగా అనిపించడం, గుండె దడ పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 😖🛏️
అయితే ఇలాంటి లక్షణాలు దీర్ఘాకాలంగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు మందులతో పాటు చికిత్సను అందించే మానసిక వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. వీరి సూచనలు పాటించడం ద్వారా స్లీప్ యాంగ్జైటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అయితే వైద్యులను సంప్రదించేకంటే ముందే.. ఇంట్లో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు 😌🛌