top of page
Shiva YT

🌨️🏔️🚗 మంచు కురిసే వేళలో కాశ్మీర్‌ అందాలు..

🗻 శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి రాంబన్ జిల్లా మెహర్ ప్రాంతంలో శుక్రవారం రోడ్డుపై కొండచరియలు విరిగిపడి, రాళ్లు పడడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆ మార్గం మూసివేశారు. హైవేను కూడా త్వరలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

🌧️ నవంబర్ 10న కురిసిన వర్షం, హిమపాతం కారణంగా ఇక్కడ వాతావరణ పరిస్థితి మరింత దిగజారిపోయింది. చాలా ప్రాంతాలకు కుప్వారా అడ్మినిస్ట్రేషన్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వాతావరణం అనుకూలించే వరకు ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. వర్షపాతం క్రమంగా తగ్గుతుందని వాతావరణ శాఖ (మెట్) అంచనా వేసింది.

❄️ హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితిలో కూడా తాజా మంచు కారణంగా రోడ్లపై తెల్లటి మంచు పరుచుకుంది. దట్టమైన మంచు కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న పర్వతాలపై తెల్లటి పలకలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

🏞️ గుల్‌మార్గ్‌తో సహా కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాలలో దట్టంగా కురుస్తున్న మంచు, అడపాదడపా వర్షాలు మైదానాలను ముంచెత్తాయి. హిమపాతానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

bottom of page