👨⚕️ వైద్యుల అభిప్రాయం ప్రకారం, రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 💤
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాత్రిళ్లు మంచి నిద్ర పట్టాలంటే పడుకునే ముందు కొన్ని రకాల పానియాలు సేవించాలంటున్నారు నిపుణులు. 🥤 ఈ పానియాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 💪
🍵 పసుపు పాలు అత్యంత ప్రభావవంతమైనవి. పసుపు కలిపిన పాలలో క్రిమినాశక యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగితే నిద్ర బాగా పడుతుంది. 🥛
🍵 గ్రీన్ టీలో పరిమిత మొత్తంలో కెఫిన్ ఉంటుంది, నిద్రకు భంగం కలిగించదు. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నిద్రలేమి నుంచి బయటపడేందుకు పుదీనా టీ తాగవచ్చు. ఈ టీ ఒత్తిడిని తగ్గించి, నిద్రను ప్రేరేపిస్తుంది. 🍵
🌿 రోగనిరోధక శక్తిని పెంచడానికి, నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు చమోమిలే టీ తాగవచ్చు. ఈ టీ నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. 🌿
🛌 అంతేకాకుండా, ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 🍵✨