top of page
Shiva YT

ఈ లక్షణాలు మీకుంటే విటమిన్ డి లోపం ఉన్నట్లే..

విటమిన్ డి లోపానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆహారం లేదా సూర్యరశ్మి లేకపోవడం ద్వారా తగినంత విటమిన్ డి పొందలేకపోతారు.

విటమిన్ డి లోపం వల్ల శరీరంలో వివిధ పరిస్థితులు ఏర్పడతాయి. విటమిన్ డి లోపం ఎముక లోపాలు, తరచుగా అనారోగ్యాలు, అంటువ్యాధులు, అలసట, ఎముక నొప్పి, నిరాశ, ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా మానకపోవటం వంటివి కనిపిస్తాయి. విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులు చేసినా బాగా అలిసిపోతారు.. అంతే కాదు విటమిన్ డి లోపం ఉన్నవారికి నిద్రలేమి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అకస్మాత్తుగా ఎముకల నొప్పి, కండరాల నొప్పి, కండరాల బలహీనత విటమిన్ డి లోపం వల్ల కలుగుతాయి. అంతేకాదు..విటమిన్ డి లోపం కారణంగా పలు రకాల చర్మ సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒంటిపై దద్దుర్లు, మొటిమలు రావడం, వృద్ధాప్య చాయలు, తరచుగా చర్మం పగిలిపోయినట్టుగా మారటం వంటి అనేకరకాల సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా విటమిన్-డి లోపం ఉందని గుర్తించి, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటుగా, ఉదయం పూట సూర్యరశ్మిని శరీరానికి తగిలేలా చూసుకోండి. సూర్యరశ్మి మన శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. విటమిన్-డి లోపాన్ని నివారిస్తే అనారోగ్య బాధల నుండి బయట పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ డి ఉత్తమ ఆహార వనరులు కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్, స్వోర్డ్ ఫిష్, ట్యూనా ఫిష్, ఆరెంజ్ జ్యూస్, పాల ఉత్పత్తులు, సార్డినెస్, గుడ్డు సొనలు, చీజ్, బీఫ్ లివర్, కొన్ని రకాల పుట్టగొడుగులు.

bottom of page