top of page

🎬 ఆ కారణం వల్లే గేమ్ చేంజర్ వాయిదా..!

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా "గేమ్ చేంజర్". 📅 కొందరు ఆర్టిస్టుల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం వల్లనే సెప్టెంబర్‌ షెడ్యూల్‌ వాయిదా పడిందని అన్నారు మేకర్స్. 🎥

అక్టోబర్‌ రెండో వారంలో షూటింగ్‌ మళ్లీ మొదలవుతుందని చెప్పారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ "గేమ్ చేంజర్".

లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా "చంద్రముఖి2". 🌟 కంగన రనౌత్‌ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 📆 పి.వాసు దర్శకత్వం వహిస్తున్న సినిమా "చంద్రముఖి2". చంద్రముఖి కేరక్టర్‌ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలిపారు.

🌟 గోపీచంద్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలోని మాంటెరాలో మొదలు కానుంది. డైరక్టర్‌ శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా సినిమా లొకేషన్స్ కి సంబంధించి ఓ వీడియో షేర్‌ చేశారు.

అఖిల్‌ కొత్త సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. 🎥 కోలీవుడ్‌ డైరక్టర్‌ లింగుస్వామితో అఖిల్‌ సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అఖిల్‌కి లింగుస్వామి కథ చెప్పారట. అఖిల్‌కి కథ నచ్చినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అక్కినేని కాంపౌండ్‌గానీ, లింగుస్వామిగానీ స్పందించలేదు. 📢🎥

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page