top of page

తెలంగాణలో మద్యం షాపులకు బారి టెండర్లు , 3 రోజుల్లోనే 2 వేల దరఖాస్తులు

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు అనూహ్య రెస్పాన్స్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అబ్కారీ శాఖ చెబుతోంది. దరఖాస్తు ఫీజు కింద రూ.2 లక్షలు వసూలు చేస్తున్న వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదు.

తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు అనూహ్య రెస్పాన్స్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అబ్కారీ శాఖ చెబుతోంది. దరఖాస్తు ఫీజు కింద రూ.2 లక్షలు వసూలు చేస్తున్న వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదు. గత నోటిఫికేషన్ సందర్భంగా ప్రభుత్వానికి రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరిందని.. ఈసారి దీనికి మించిన స్థాయిలో ఆదాయం వస్తుందని అంచనా.

అన్ని జిల్లాల్లోనూ రెస్పాన్స్ బాగానే వున్నప్పటికీ.. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో మద్యం షాపుల టెండర్లకు చాలామంది పోటీపడుతున్నారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు వుండగా.. ఇప్పటికే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నెల 18న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ నెల 21న లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page