top of page
MediaFx

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు 🌟🎂


తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఏ హీరోయిన్ కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ నేడు ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ సెలబ్రెటీలు సాయి పల్లవికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలు కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సాయి పల్లవి మెడిసిన్ చదివింది.. అయితే నటనను వృత్తిగా ఎంచుకుంది. సాయి పల్లవి డ్యాన్స్‌లో అదరగొడుతుంది. ఆమె డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ తన డాన్స్ స్కిల్స్‌ చూపించే అవకాశం దర్శకుడు ఇస్తుంటారు. ఇదిలా ఉంటే, ఆమె నటిగా ఎలా మారింది అనే వివరాలు ఒక్కసారి చూద్దాం..

సాయి పల్లవి 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ  మాతృభాష బడగ. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలో మెరిసింది. సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్‌గా నటించింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సాయి పల్లవి కెరీర్ టర్న్ అయ్యింది.

సాయి పల్లవి నటించిన ‘కాళి’ (2016), ‘ఫిదా’ (2017), ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (2017), ‘మారి2’ (2018), ‘లవ్ స్టోరీ’ (2021), ‘శ్యామ్ సింగ్ రాయ్’ (2021) ), ‘గార్గి’ (2022) వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ;ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. 2020లో, ఫోర్బ్స్ ఇండియా జాబితాలో సాయి పల్లవి పేరు కూడా కనిపించింది. 2005-2009 మధ్యకాలంలో సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2009లో ‘ఢీ’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో ఫైనల్‌ చేరింది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో చాలా సినిమాలున్నాయి. శివకార్తికే నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య 23వ సినిమా తండేల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.


bottom of page