top of page

🎬 ‘ఓసి పెళ్ళామా’ అంటూ గోడు వెళ్లబోసుకుంటున్న విజయ్ దేవరకొండ.. 🎬

🌟 టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం "ఖుషీ". డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటించింది.

🎶 ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

🎉 ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. మరోవైపు మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది సామ్.

🌍 ఇక విజయ్ దేవరకొండ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఐదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది మూవీ టీం.

💞 ఓసి పెళ్లామా అంటూ సాగిపోతున్న ఈ పాటలోని సీన్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. 🎶🎬


Comments


bottom of page