top of page

​​'ఖుషి' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..🌟🎥

విజయ్ దేవరకొండ , సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం '‘ఖుషి '’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండ , సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం '‘ఖుషి '’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని.. ప్రమోషన్స్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ కు అయితే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాటలు యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్టు 09న రిలీజ్ చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకన్ల ఉందంటూ విజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇది వరకే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు సీబీఎఫ్‌సీ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది.🌟🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page