కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమాపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు. రాయన్ సినిమాలో ధనుష్ యాక్టింగ్, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ నటనతో మరోసారి మెప్పించారని.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు వందశాతం కష్టపడ్డారని అన్నారు. ఇక మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని.. రాయన్ మూవీ కచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని.. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహేష్ ట్వీట్ కు సందీప్ కిషన్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రాయన్ సినిమాను తమిళ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కాశిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేశారు. మొదటి రోజే మంచి రివ్యూస్ అందుకున్న ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.