కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్‌కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని.. తప్పుడు కేసుల భాదితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్‌కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని.. తప్పుడు కేసుల భాదితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసులకు భయపడేది లేదని.. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలన్నారు. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగిలిన బీఆర్‌ఎస్ ఎంపీపీలు స్పందించాలన్నారు. ఎక్కడికక్కడ సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందన్నారు కేటీఆర్.
మరోవైపు అసెంబ్లీ ఫలితాలతో ఢీలా పడ్డ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తుంది బీఆర్‌ఎస్ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి… పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు అగ్ర నాయకులు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం గుర్తుంచుకొని ముందుకు సాగాలన్నారు కేటీఆర్. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు, ఆసలు సినిమా ముందుందని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి.. చెమటను ధారపోసి వికాసం వైపు మళ్లించారని గుర్తుచేసారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తే గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.