top of page

📅🗳️ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటో చెప్పిన కేటీఆర్

🏞️🔍 నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని.. అప్పట్లో ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదని కేటీఆర్ అన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని.. సూర్యాపేట లో మాత్రమే గెలిచామని చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.

🅱️🏞️ బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఉదాసీన వైఖరి వీడాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు.. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గత నవంబర్‌లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపాలని చెప్పారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదలిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురిoచిందని కేటీఆర్ విమర్శించారు. KRMBకి కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగిoచి తెలంగాణ జుట్టును కేంద్రంలో చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని అన్నారు. అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోదీ బీఆర్‌ఎస్‌ను కాలుస్తారట అని కేటీఆర్ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ అదానీని దొంగ అంటే.. రేవంత్ రెడ్డి దొర అంటున్నారని తెలిపారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని.. దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు. 🗳️💬

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page