“గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు” అని కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
అయితే అంతకుముందు మహిళలకు ఉచిత బస్సు పథకంపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య రగడ రాజుకుంది. మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు, వాళ్ల పని వాళ్లు చేసుకుంటే తప్పేంటి అంటూ అసెంబ్లీలో మంత్రి సీతక్క చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బస్సులో అల్లం వెల్లుల్లి ఏరితే తప్పని తాము అనలేదంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. మనిషికో బస్సు పెట్టండి, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మహిళలను బ్రేక్ డ్యాన్సులు చేసుకోమంటారా అంటూ కేటీఆర్‌పై మంత్రి సీతక్క మండిపడ్డారు. లాంగ్ జర్నీలో ఖాళీగా ఉండలేక, పనులు చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు సీతక్క. మీ ఇళ్లల్లో ఆడపడుచులు లేరా అంటూ కేటీఆర్‌పై మంత్రి ఫైర్ అయ్యారు. బైట్: సీతక్క, తెలంగాణ మంత్రి. మాటల మంటలు రేపిన ఈ డైలాగ్ వార్‌పై సీరియస్ అయిన మహిళా కమిషన్.. KTR వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పారు.