top of page

ఎవరు ఆగం చేసినా ప్రజలు ఆగం కావద్దు అంటూ వ్యాఖ్యానించారు..

మంచిర్యాల జిల్లా : ఎలక్షన్స్ రాగానే గంగిరెద్దుల వలె వస్తారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అని అడుగుతున్నారని, స్వాతంత్య్రం వచ్చినప్పటికి నుండి పాలించినది కాంగ్రెస్ పార్టీయే కదా... అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగు, తాగునీరు కొరత ఉండేదన్నారు. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనడం లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందన్నారు.

మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తానని తెల్లముఖం వేశారంటూ ఆరోపించారు. దేశ ధనం మొత్తాన్ని అదానీకే దోచి పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతారో తనకు అర్థంకాదన్నారు. ఎవరు ఆగం చేసినా ప్రజలు ఆగం కావద్దు అంటూ వ్యాఖ్యానించారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.

బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. బెల్లంపల్లిలో 7 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దళితులు ధనవంతులు కావాలని దళితబంధు పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. దళితబంధు కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page