బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కొత్తగా ఏర్పాటు చేసిన టీ - వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్‌ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు . చేనేత కార్మికులకు అండగా ప్రారంభించిన టి వీవ్స్ & క్రాఫ్ట్స్ చేనేత కార్మికులందరికీ ఒక చేయూత అని మంత్రి కేటీఆర్ చెప్పారు . ఈ స్టోర్ లో అనేక చేనేత చీరలు ఇంకా నైపుణ్యం గల హస్తకళా వస్తువులు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి . వీటిని ఈ స్టోర్ లోనే కాకుండా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా కొనవచ్చు . ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు , టి వీవ్స్ & క్రాఫ్ట్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ అళగు వర్షిణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
వెబ్సైటు లింక్ : https://tweavesandcrafts.com/