top of page

కోల్‌క‌తా హ‌త్యాచార నిందితుడికి లై డిటెక్ట‌ర్ టెస్ట్‌.. అత‌నేం చెప్పాడంటే


కోల్‌క‌తా: కోల్‌క‌తాలో ఆర్‌జీ కార్ ఆస్ప‌త్రి ట్రైనీ వైద్యురాలిని హ‌త్యాచారం చేసిన కేసులో.. ప్ర‌ధాని నిందితుడు సంజ‌య్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్(Polygraph Test) నిర్వ‌హించారు. కోల్‌క‌తా పోలీసు శాఖ‌లో సివిల్ వాలంటీర్‌గా అత‌ను ప‌నిచేశాడు. అయితే సీబీఐకి ఇచ్చిన‌ లై డిటెక్ట‌ర్ టెస్టులో.. నిందితుడు సంజ‌య్ కొన్ని కీల‌క అంశాలు వెల్ల‌డించాడు. నేరం జ‌రిగిన రాత్రి జ‌రిగిన ప‌రిణామాల‌ను రాయ్ తెలిపాడు. ఆ రోజు రెండు రెడ్‌లైట్ ఏరియాల్లో తిరిగిన‌ట్లు అత‌ను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొన‌లేద‌ని వెల్ల‌డించాడు. ఓ వీధిలో ఓ మ‌హిళ‌ను వేధించిన‌ట్లు పాలీగ్రాఫ్ టెస్టులో ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిఘా కెమెరాల‌కు చిక్కింది. ఆ రోజునే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడిన‌ట్లు కూడా అత‌ను చెప్పాడు. ఆమె న‌గ్న ఫోటోల కోసం సంజ‌య్ అడిన‌ట్లు తెలిసింది.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page