top of page

‘కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూముల వేలం.. ఏకంగా ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే.? 💰🏞️

హైదరాబాద్ కోకాపేట, బుద్వేల్‌లో రికార్డు ధర పలికిన భూములు హెచ్ఎండీఏకు కాసుల వర్షం కురిపించాయి.

ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా పలికి రికార్డు సృష్టించడంతో.. కోకాపేట్, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు సుమారు 7వేల కోట్ల మేర ఆదాయం వచ్చింది. కోకాపేట్, బుద్వేల్ రెండింటిలోనూ బిడ్డర్లు నిర్ణీత చెల్లింపు షెడ్యూల్‌కు అనుగుణంగా తమ చెల్లింపులను వెంటనే పూర్తి చేశారని హెచ్ఎండీఏ తెలిపింది. కోకాపేట్‌లో ఆగస్టు 3న మొత్తం 45.33 ఎకరాల్లో 7 ప్లాట్ల ఈ-వేలంలో 3 వేల 319.60 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున ఒక్కో ఎకరానికి 73.23 కోట్లు పలికినట్లు హెచ్‌ఎండీఏకు తెలిపింది. అత్యధికంగా ఒక ఎకరానికి 100 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. అదే విధంగా బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏకు 6వేల 945.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 💵📈📊

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page