వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి పలు రికార్డులు బ్రేక్ చేశాడు. 🏏👏
ఈ మ్యాచ్‌లో కోహ్లి 180 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో సెంచరీని అందుకున్నాడు. ఫలితంగా తాను ఆడుతున్న 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోవడంతో పాటు, దాదాపు అయిదేళ్ల తర్వాత టెస్టుల్లో విదేశీ గడ్డపై సెంచరీని నమోదు చేశాడు. 😎✌️
కోహ్లీ చివరగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సెంచరీ చేశాడు. 🇮🇳🏴
ఓవర్‌నైట్ స్కోరు 87 పరుగులతో రెండోరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కోహ్లీ 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు.
ఈ సెంచరీతో టెస్టుల్లో దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. దాంతోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 76 సెంచరీలను అందుకున్నాడు. 🙌🏆
అంతేకాకుండా, భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహ్వాగ్ (8,586)ను వెనక్కి నెట్టి కోహ్లీ (8, 676) అయిదోవ స్థానానికి చేరాడు .