top of page
MediaFx

మహేశ్ మనసు బంగారం.. పుట్టిన రోజున ఏం చేశాడో తెలుసా?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఎప్పటిలాగే తన పుట్టిన రోజు (ఆగస్టు 09) పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం తన సొంతూరు బుర్రిపాలెంలో మహేశ్ బాబు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆంధ్రా హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ లో సుమారు 157 మంది పిల్లలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మొత్తం 155 మంది పిల్లలు, పెద్దలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎంబీ ఫౌండేషన్ నిర్వాహకులు. మహేశ్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని బుర్రిపాలెంలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా 157 మంది పిల్లలు, పెద్దలు ఈ మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు. మహేశ్ బాబు, ఆంధ్రా హాస్పిటల్స్ కలిసి ఏర్పాటు చేసిన 41వ వైద్య శిబిరం ఇది. ఈ విషయంలో మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తోన్న ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం’ అని ఎంబీ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ హెల్త్ క్యాంప్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మా హీరో మనసు బంగారమంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సితార పుట్టిన రోజు (జులై 22)న కూడా బుర్రిపాలెంలో ఇదే విధంగా ఉచితంగా మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు మహేశ్ బాబు ఫౌండేషన్ నిర్వహాకులు. ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు పిల్లలకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతలు కడుక్కోవడం, డెండ్యూ, మలేరియా నివారణ, అలాగే సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్లపై అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అవసరమైన మందులు, విటమిన్ ట్యాబ్లెట్లను అందజేశారు. పోషకాహార లోపంతో బాధపడుతోన్న పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స అంద జేశారు.



bottom of page