top of page
MediaFx

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ??


కరోనా తరువాత పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలను తగ్గించారా.. అదే మందుబాబులకు బాగా కలసి వచ్చిందా? నిజానికి ఫుల్లుగా మద్యం తాగి.. ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్స్ చేసేవారు తక్కువేమీ లేరు. సిటీల్లో అయితే వీరి నెంబర్ ఎక్కువగానే ఉంటుంది. కానీ టౌన్ లో కూడా ఇలాంటి కల్చర్ పెరుగుతోంది. దీనికోసం నేను ఏపీలో ఒక ఊరిని కేస్ స్టడీగా తీసుకుని దాని డీటైల్స్ చెబుతాను. అనకాపల్లిలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిలో యూత్ ఎక్కువగా ఉంది. గతంలో కోర్టులో హాజరుపరిస్తే వారికి జైలుశిక్ష విధించేవారు. ఇప్పుడు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ. 10 వేలు కట్టాల్సిందేనని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ అనకాపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మద్యం మత్తులో వాహనాలు నడపడం కల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత నెల నుంచి మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధిస్తున్నారు. భారీగా జరిమానాలు విధించడం వల్ల మార్పు వస్తుందని ఆశిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అనకాపల్లిలో ఇటీవల మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి ఆల్కహాల్‌ రీడింగ్‌ తీయగా 700 నమోదైంది.

bottom of page