top of page

రాజమౌళి ప్రతి సినిమాలో ఈ నటుడు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా..?


రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆ తర్వాత వచ్చిన సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ, ఆర్ఆర్ఆర్ ఇలా జక్కన్న తెరకెక్కించిన అన్ని సినిమాల్లో శేఖర్ కచ్చితంగా కనిపిస్తాడు. రాజమౌళి మొత్తం 12 చిత్రాలు తెరకెక్కించగా.. 9 సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు శేఖర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన చత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా నుంచి అతడిని చత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. రాజమౌళి సినిమాలలో శేఖర్ కనిపించడానికి ఓ కారణం ఉంది. రాజమౌళి మొదటిసారిగా దర్శకత్వం వహించిన శాంతి నివాసం సీరియల్ సమయంలోనే శేఖర్‏తో పరిచయం ఏర్పడింది. కానీ శేఖర్ ఎప్పుడూ జక్కన్నను అవకాశాలు ఇవ్వాలని అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్ధేశంతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారని గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు శేఖర్. సినిమా స్టార్ట్ చేశాక తనకు పాత్ర ఉందని రాజమౌళి తనను పిలుస్తాడని.. అప్పటివరకు సినిమా ఏంటీ.. తన పాత్ర ఏంటనేది తనకు తెలియదని అన్నారు. మొదటి సీరియల్లో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత స్నేహానికి జక్కన్న ఇచ్చే విలువ తెలిసి హ్యాట్సాఫ్ రాజమౌళి అంటున్నారు నెటిజన్స్.

댓글


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page