బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత సంపన్న (richest in Bollywood) వ్యక్తి. హురన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధిక సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు. బిగ్‌బీ సంపద రూ.1,600 కోట్లుగా ఉంది. అయితే, సినిమాల్లోకి రాకముందు బిగ్‌బీ సాధారణ జీవితం గడిపారు. ఆ నాటి జ్ఞపకాలను పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ ఎపిసోడ్‌లో బిగ్‌బీ పంచుకున్నారు.
కాలేజీ పూర్తైన తర్వాత కోల్‌కతాలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపినట్లు చెప్పారు. అప్పట్లో తన నెలవారీ ఆదాయం కేవలం రూ.400 మాత్రమే అని తెలిపారు. అంతేకాదు, ఏకంగా ఎనిమిది మంది వ్యక్తులతో కలిసి ఓ చిన్న గదిలో నివసించే వాడినని చెప్పారు. ‘నేను నా చదువు ముగించుకొని ఉద్యోగం వెతుక్కుంటూ కోల్‌కతా వెళ్లాను. అక్కడ నాకు నెలకు రూ.400 చెల్లించే ఉద్యోగం దొరికింది. అప్పుడు నేను ఓ గదిలో 8 మందితో కలిసి నివసించే వాడిని. అందుకు నాకు ఆశ్చర్యం కలగలేదు. ఆ గదిలో రెండు పడకలు మాత్రమే ఉండేవి. చాలా సరదాగా ఉండేది. రెండు బెడ్స్ అందరికీ సరిపోయేవికాదు. నేలపైనే పడుకునే వాడిని. కొన్నిసార్లు మంచంమీద పడుకునేవాడిని. అయితే, మంచం, నేలపై ఎవరు పడుకుంటారు అనే దానిపై పోటీపడేవాళ్లం. ఒకరికొకరం వాదించుకునేవాళ్లం’ అంటూ గత జ్ఞపకాలను గుర్తు చేసుకున్నారుబిగ్‌బీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, హురున్ సంపన్నుల జాబితా ప్రకారం (Hurun India Rich List).. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న హీరోగా బాద్ షా షారుక్ ఖాన్ నిలిచారు. ఆయన ఆస్తులు రూ. 7,300 కోట్లు ఉంటుందని హురున్ తన జాబితాలో పేర్కొంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ లో షారూక్‌కు భాగస్వామ్యం ఉన్నది. కోల్‌కతా జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన విషయం తెలిసిందే. షారూక్ సంపద పెరగడానికి ఇది కీలకమైంది. ఆ తర్వాత బాలీవుడ్ నటి జూహీ చావ్లా సంపన్నుల జాబితాలో చోటు సంపాదించింది. ఆమె సంపద 4,600 కోట్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో హృతిక్ రోషన్ నిలిచారు. ఆయన ఆస్తి సుమారు రెండు వేల కోట్లుగా ఉన్నది. ఇక నాలుగో స్థానంలో రూ.1,600 కోట్ల సంపదతో అమితాబ్‌కు చోటు దక్కింది.