top of page

కింగ్ నాగార్జునకు ఎన్ని వేల కోట్లు ఆస్తులున్నాయో తెలుసా?


రియాలిటీ షో బిగ్ బాస్‌కి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో ఉంది. అలాగే నాగార్జునకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఇది ఒక NGO. ఇందులో సినిమా గురించిన విద్యను అందిస్తున్నారు. నాగార్జునకు హైదరాబాద్‌లో పలు ఆస్తులున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి విలువ రూ.50 కోట్లు. ఆయన సినిమా స్టూడియో విలువ 200 కోట్ల రూపాయలు. నాగార్జున దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.5 కోట్లు), ఆడి ఎ7 (రూ. 90.5 లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ ఎమ్6 (రూ. 1.76) వంటి లగ్జరీ కార్లు నాగార్జున గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో అత్యంత సంపన్న నటుల్లో షారుఖ్ ఖాన్ (రూ. 6000 కోట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 3600 కోట్ల ఆస్తులతో అక్కినేని నాగార్జున మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. నాగ్ ఒక్కో సినిమాకు 20-30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. . అలాగే బిగ్ బాస్ హోస్ట్ గా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. నాగార్జునకు కూడా క్రీడలంటే ఆసక్తి. అందుకే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ‘ముంబై మాస్టర్స్’ టీమ్‌ను కొనుగోలుచేశారు కింగ్. ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన ‘నా సామి రంగ’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘కుబేర’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page