ఈటెల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై సమీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణకు ఈ నెల 8న ప్రధనమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ప్రధాని మోదీ హనుమకొండకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈటెల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్‌కు వెళ్లనున్నారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై సమీక్ష నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 10.35 నిమిషాలకు వరంగల్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. మొదట భద్రకాళి అమ్మావారి దర్శనం, ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంకు చేరుకొని వ్యాగెన్ మ్యానిఫ్యాక్టరింగ్, POH నిర్మాణపనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ప్రదాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నా ఎస్‌పీజీ భద్రతా సిబ్బంది.. అయితే, మోదీ సభను విజయవంతం చేయడానికి జనసమీకరణ సహా పలు అంశాలపై కీలకంగా దృష్టి సారించారు బీజేపీ నేతలు. అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.