తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో బాధ్యతలు తీసుకున్న ఆయన.. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో బాధ్యతలు తీసుకున్న ఆయన.. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమని కేడర్‌కి పిలుపునిచ్చారు. తెలంగాణలో బండి సంజయ్ ఆధ్వర్యంలోనే వార్ మొదలైందన్న కిషన్ రెడ్డి.. ఆ యుద్ధం కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌కు ముందుంది ముస్సళ్ల పండుగ అంటూ ఫైర్ అయ్యారు.తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందన్న కిషన్‌రెడ్డి.. ప్రజలను అందుకోసం సిద్ధం చేస్తూ ఎన్నికలకు వెళ్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మూడు ముక్కల పార్టీలని విమర్శించారు.ప్రజలు వీరిలో ఎవరికి ఓటేసిన బీఆర్‌ఎస్‌కే ఓటేసినట్లు అని విమర్శించారు. బండి సంజయ్, పార్టీ పెద్దల సూచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లి, ఇదే అబిడ్స్ సెంటర్‌లో కేసీఆర్ నియంతృత్వ పాలనకు పాతరేస్తామని ఘాటుగా వ్యాఖ్యనించారు కిషన్‌రెడ్డి.