top of page

🏏 అసలైన లిస్టులోకి ‘కింగ్’ ఎంట్రీ.. 🤴

🏴వెస్టిండీస్‌, 🇮🇳 భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్. భారత్ తొలి బ్యాటింగ్ చేస్తున్న ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట ముగిసేసరికి 87 పరుగులతో క్రీజులోనే ఉన్న విరాట్ కోహ్లీ అసలైన లిస్టులో స్థానం పొందాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

దక్షిణాఫ్రికా క్రికెట్ లెజెండ్ కల్లీస్ తన కెరీర్‌లో మొత్తం 519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 25,534 పరుగులు చేశాడు.ఇక కింగ్ కోహ్లీ తాను ఆడుతున్న 500వ మ్యాచ్‌లోనే కల్లీస్‌ని అధిగమించి మొత్తంగా 25,548 రన్స్ చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్థానంలో ఉన్నారు. సచిన్ తర్వాత కుమార సంగక్కర్(28,016).. రికీ పాంటింగ్(27,483).. మహేలా జయవర్ధనే(25,957).. వరుస స్థానాల్లో ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీ((25,548*) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్లుగా ఎదిగాడు.కాగా, ఇప్పటికే 500 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ(25,548*).. రికీ పాంటింగ్(25,035), సచిన్ టెండూల్కర్(24,874), జాక్వెస్ కల్లీస్‌(24,799) వంటి దిగ్గజాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. 🏆🥳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page