top of page
MediaFx

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వివాదాస్పద లేఖలు ✉️

ఖమ్మంలో ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజ స్వరూపం’ అంటూ కొందరు రాసిన లేఖలు కలకలం రేపుతున్నాయి. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ వాటిలో ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు పొంగులేటి ఎలా సంపాదించారని వాటిల్లో పేర్కొన్నారు.

అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండానే ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు లేఖలో రాసుకొచ్చారు. వైఎస్ జగన్‌కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏజెంట్ అంటూ వారు పేర్కొన్నారు. మువ్వా విజయ్ బాబుకి సముచిత స్థానం కల్పించలేదని లేఖలో చెప్పారు.

ఖమ్మంలో నిర్మించనున్న రింగ్ రోడ్ పక్కన వేల ఎకరాలు కొనుగోలు చేసేందుకు పొంగులేటి ప్రయత్నం చేశారని అందులో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కారులో పొంగులేటిదే పెత్తనం అంటూ అందులో పేర్కొన్నారు. కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం లేకపోతే మిగిలిన కులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లేఖలు, పీడీఎఫ్ ద్వారా ప్రచారం చేయాలంటూ లేఖల్లో పిలుపునిచ్చారు.

కనగండ్ల నాగభూషణం, కనకమేడల ప్రసాద్ రావు, మేడ తిరునాదరావు, కాటేపల్లి కోటేశ్వరరావు, నల్ల మోతు కృష్ణ మూర్తి, దమ్మాలపాటి తిరుమలరావు, నూతలపాటి వెంకట అప్పారావు పేరుతో లేఖలు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలోని నేల కొండపల్లిలో ఈ లేఖలు కనపడ్డాయి. ప్రముఖులకు లేఖలను పోస్ట్ చేశారు. ఫ్రమ్ అడ్రసు అంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరు రాశారు.

bottom of page