top of page

ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఖలిస్థానీ దుశ్చర్యలు 🇮🇹

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఖలిస్థానీ వాదులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇటలీలోని మహాత్మాగాంధీ విగ్రహ పీఠంపై ఇటీవల హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన వివాదాస్పద రాతలు రాశారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ క్వాత్రా ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతేడాది కెనడాలో కూడా ఖలిస్థానీ వాదులు మహాత్మాగాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాసిన విషయం తెలిసిందే.

ఇది మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మొదటి విదేశీ పర్యటన. జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో వరుసగా ఐదోసారి మోదీ పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. ఈ సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page