🏛️ నూతన సచివాలయం ప్రారంభం అయిన తర్వాత రెండవసారి తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతోంది. 👥👤 ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సుమారు 40 నుంచి 50 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. 💬📊 🌧️ భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది. ☔💔 భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతోపాటు రోడ్లు పెద్దయెత్తున దెబ్బతిన్నాయి.
🛣️📉 దాంతో.. నష్టాన్ని అంచనా వేసి, పరిహారంపై నిర్ణయం తీసుకోనుంది. 🤔🛠️ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 🚦💡 దాదాపు 3వేల కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 💰📜 రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో మూడు నెలలే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సీఎం కేసీఆర్ ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 🗳️🗓️ 📜 గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘నిరుద్యోగ భృతి’లాంటి అమలు కాని హామీలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. 📄📞 పాక్షికంగా అమలైన పంట రుణాల మాఫీ లాంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలిసింది. 💼💳📉 మరోవైపు.. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య విధ్యా అధిపతుల వయో పరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనలు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా రెగ్యులరైజేషన్ బిల్లులపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. 💼📚💼🏙️🛣️📜🏛️ కేబినెట్‌లో చర్చించిన అనంతరం వచ్చే అసెంబ్లీ సమావేశాల‌్లో గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోనున్నారు. 🗣️🏛️🏛️📜 🕰️ రెండోసారి సభ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం పంపితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 🗓️🕰️ ఇక… ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సోమవారం కేబినెట్ సమావేశం గుడ్‌న్యూస్ చెప్పనుంది. 🎯📰 ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించడంతో.. క్యాబినెట్లో చర్చించి ఆమోదం ముద్ర వేయనుంది ప్రభుత్వం. 💼💼🏛️