top of page

ఇకపై కేరళ కాదు.. పేరు మారింది.. కొత్త పేరు ఇదే


కేరళ రాష్ట్రానికి కొత్త పేరును ప్రతిపాదిస్తూ శాసనసభలో పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్‌ ప్రవేశపెట్టి ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే, విపక్షాలు కొన్ని సవరణలను మాత్రం ప్రతిపాదించాయి. కాగా, కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కానీ, ఆ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. దీంతో మళ్లీ కొత్తగా తీర్మానం చేసింది.

ఏదైనా రాష్ట్రం పేరును మార్చాలంటే రాజ్యాంబద్దంగా కేంద్రం ఆమోదం ఉండాలి. రాజ్యాంగంలోనే పేరును మార్చాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశం. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. గతంలోని తీర్మానం ప్రకారం రాజ్యాంగంలోని మొదటి, ఎనిమిదో షెడ్యూల్‌లో పేరు మార్చాలని కోరినట్లు తెలిపారు. కానీ కేంద్రం మాత్రం మొదటి షెడ్యూల్‌లోనే మార్పు చేయాల్సి ఉందని చెప్పినట్టు సమాచారం.

‘కేరళం’ అనే పేరు మలయాళమని, రాజ్యాంగంలో రాష్ట్రం పేరు కేరళగా పేర్కొన్నారని అన్నారు. కేరళ పేరు మార్చాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని, తక్షణమే రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. మలయాళంలో ‘కేరళం’గా పిలుచుకుంటాం.. మలయాళీల ఏకీకృత కేరళ డిమాండ్ జాతీయ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రముఖంగా ఉందని ఆయన నొక్కిచెప్పారు. రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ‘కేరళం’ అని రాయాలని ఆయన కోరారు.

Коментарі


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page