top of page
Shiva YT

ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..

థియేట్రికల్ విడుదలైన 4-6 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షోలు క్యాన్సిల్ చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని గత కొద్దిరోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ఓటిటి అయితే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు 'ది కేరళ స్టోరీ' మూవీ ఓటీటీ OTT హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం జీ 5(Zee5)కొనుగోలు చేసింది. థియేట్రికల్ విడుదలైన 4-6 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. అలాగే కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలు ఇస్లాంలోకి మార్చబడ్డారని, ఇందులో కొంతమంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, ఐసిస్ పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొందరు ఐసిస్ పోరాటానికి మద్దతుగా సిరియా వెళ్లిన ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సినిమాను తప్పుపట్టారు. 32 వేల మంది మతం మారినట్లు రుజువు చేస్తే రూ.1 కోటి ఇస్తామని ముస్లిం సంస్థ ఛాలెంజ్ చేసింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ .. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.

'కేరళ స్టోరీ' 2వ రోజు దాదాపు రూ.12.50 కోట్లు, 3వ రోజున రూ.16.50 కోట్లు వసూలు చేసింది. దీని మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 3 రోజుల్లో దాదాపు రూ.35 కోట్లకు చేరుకోవడం విశేషం. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. 'కేరళ స్టోరీ'లో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.

bottom of page