పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అదా శర్మ. ఆ చిత్రం తర్వాత అదాకి చిన్న చిన్న అవకాశాలు తప్ప ప్రధాన హీరోయిన్ గా ఆఫర్స్ రాలేదు.
పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అదా శర్మ. ఆ చిత్రం తర్వాత అదాకి చిన్న చిన్న అవకాశాలు తప్ప ప్రధాన హీరోయిన్ గా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం అదా శర్మ గ్లామర్ పక్కన పెట్టి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ది కేరళ స్టోరీ'. గత ఏడాది కశ్మీర్ పండిట్ల మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు కేరళ స్టోరీ ట్రైలర్ చూస్తుంటే ఆరకమైన ప్రకంపనలు, వివాదాలు సృష్టించే చిత్రం అవుతుందని అర్థం అవుతోంది. 'షాలిని ఉన్ని కృష్ణన్ అనే మధ్య తరగతి హిందూ యువతిగా బ్యాగ్ గ్రౌండ్ లో అదా శర్మ పాత్ర గురించి వినిపిస్తుంది. కట్ చేస్తే ఆమెని ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదిగా అరెస్ట్ చేసి విచారణ చేస్తుంటారు. మీరు ఎప్పుడు ఐసిస్ లో జాయిన్ అయ్యారు అని ప్రశ్నించగా.. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను అనేదానికంటే ఎందుకు జాయిన్ అయ్యాను, ఎలా జాయిన్ అయ్యాను అని తెలుసుకోవడమే ముఖ్యం అని అదా శర్మ బదులిస్తుంది. ఆ తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు తమ ఏజెంట్స్ ద్వారా అదాని ఇస్లామిక్ లోకి ఎలా కన్వర్ట్ చేశారు..ట్రాప్ చేసి ఉగ్రవాదిగా ఎలా మార్చారు అనే సన్నివేశాలు ఉత్కంఠని పెంచుతున్నాయి. ముస్లిం యువతి, ఐసిస్ ఉగ్రవాదుల ఏజెంట్ అయిన ఓ అమ్మాయి ఉంటుంది. ఆమె అదా శర్మని నెమ్మదిగా ట్రాప్ చేస్తూ మనసులో ఇస్లాం బీజం నాటుతుంది. ట్రాప్ లో భాగంగా అదా శర్మ పై ఆమె స్నేహితులపై దాడి జరుగుతుంది. అప్పుడు ఆమె స్నేహితురాలు, ముస్లిం యువతి మాట్లాడుతూ అల్లా మనల్ని కాపాడుతాడు అని చెబుతుంది. నువ్వు ఎప్పుడూ అల్లా గురించే మాట్లాడతావా అని అదా శర్మ ప్రశ్నిస్తుంది. అదా శర్మ వాళ్ళ ట్రాప్ లోపడి ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఫాతిమాగా పేరు మార్చుకుంటుంది. ఆ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. బ్యాగ్ గ్రౌండ్ లో ఇది బగ్లోబల్ అజెండా.. మా ఎక్స్ చీఫ్ మినిష్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు .. వచ్చే 20 ఏళ్లలో కేరళ పూర్తిగా ఇస్లామిక్ రాష్ట్రంగా మారబోతోందని చెప్పారు అనే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అదా శర్మ ఐసిస్ లో జాయిన్ కావడం జరుగుతుంది. అదా శర్మ తన నటనతో అదరగొట్టేసింది అని చెప్పొచ్చు. చూస్తుంటే దికేరళ స్టోరీ చిత్రం మరిన్ని వివాదాలకు, సంచలనాలకు కేంద్రబిందువుగా మారబోతున్నట్లు అర్థం అవుతోంది. మే 5న పాన్ ఇండియా చిత్రంగా కేరళ స్టోరీ అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది.